11, అక్టోబర్ 2013, శుక్రవారం

http://vbsowmya.wordpress.com/ science

శాస్త్రీయ పరిశోధనల గురించి సామాన్యుడికి వివరించడం ఎలా? – రెండు పిట్ట కథలు

శాస్త్రీయ పరిశోధనల గురించి సామాన్యుడికి వివరించడం ఎలా? – అన్న మీమాంస గొప్ప గొప్ప వాళ్ళకే వచ్చింది. నేనెంత?
(నా సుత్తి భరించలేని వాళ్ళు డైరెక్టుగా కాస్త కిందకి వెళ్ళిపోయి, నేను చెప్పబోయే రెండు కథలూ చదూకోండి – ఒకటి ఐన్స్టీన్ చెప్పింది, ఒకటి రూథర్ఫోర్డ్ చెప్పింది)
*********************+
ఎందుకు ఇలా మొదలుపెట్టానంటే – మొన్నీమధ్య మా డిపార్ట్మెంట్ కి బంగోర్ విశ్వవిద్యాలయం నుంచి ఒకాయన వచ్చారు. ఆయన మనుషులు భాష నేర్చుకునే పధ్ధతి గురించి పరిశోధన చేస్తూ ఉంటారట. మాటల సందర్భంలో – “ఎవరన్నా నేను లింగ్విస్ట్ ని అని పరిచయం చేస్కున్నారు అనుకోండి, సాధారణంగా అవతలి వాళ్ళు – “ఓ, అయితే మీకు చాలా భాషల్లో మాట్లాడడం వచ్చన్నమాట” అంటారు… అన్నారు. లింగ్విస్ట్ అన్నాక, భాషలని అధ్యయనం చేస్తారు కానీ, భాషని నేర్చుకోవాలి అన్న రూల్ లేదు కదా” అన్నారు. అలాగే, మరోసారి నా సీనియర్ ఒకబ్బాయి – “నువ్వేం చేస్తున్నావు అని మా పల్లెలో ఉన్న స్నేహితులు అడిగితే వివరించడం చాలా కష్టంగా ఉంటుంది. రిసర్చి చేస్తున్నాను అనగానే, సాంకేతికతకు సంబంధించిన సమస్త విషయాలు నాకు తెలిసి ఉండాలి అని ఊహిస్తారు వాళ్ళు. ఏదో నాకు సంబంధం లేని విషయం గురించి సందేహం అడుగుతారు. నాకు అవి తెలీవు అంటే నిరాశపడతారు” అని అన్నాడు.
మొన్నోరోజు అసలు నువ్వు ఎగ్జాక్ట్ గా దేని మీద రిసర్చ్ చేస్తున్నావు? అని ఒకరు అడిగారు… చెప్పడం మొదలుపెట్టగానే, “నేనిప్పుడు సాన్కేతికుడిని కాను. కనుక, మామూలు భాషలో చెప్పు” అన్నారు. సరేలెమ్మని, కొంచెం మామూలు భాషలో చెబుదాం అని మొదలుపెట్టగానే, మధ్యలోనే ఆపేస్తూ.. “గూగుల్ లో కూడా ఇలాంటివేగా చేసేది?” అన్నారు. అప్పుడు అనిపించింది. మరీ ఓవర్-సిమ్ప్లిఫై చేసి చెప్పకూడదేమో అని :) .
“మన ప్రపంచం మరీ ఓవర్-స్పెషలైజ్డ్ అయిపొయింది” – అని నాక్కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ, దానిలో ఉండే అందం దానిలో కూడా ఉందేమో. ఇంకా నేనే అర్థం చేస్కోలేదేమో.
అలాగే పనిలో పనిగా మరొక్కటి కూడా అనిపించింది – గ్రౌండ్ బ్రేకింగ్ రిసర్చ్ అంటూ ఏదీ ఉండదేమో….ఉన్నా కూడా, అది కొంత మంది చేసిన పరిశోధనల ఆధారం పైన మాత్రమే నిలవగలదేమో అని. మొత్తానికి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, మన మట్టుకు మనం, మన గుంపులోని వారు ఎంత “వావ్…గొప్ప రిసర్చి చేసేస్తున్నాం కదా” అనుకున్నా కూడా, చివరాఖరికి ఉదాహరణకి మనం మన అమ్మమ్మకో, తాతయ్యకో మనం చేస్తున్న పనిని వివరించబోతే… గొంతులో ఎన్ని వెలక్కాయలన్నా అడ్డం పడొచ్చు. నేనింకా ఈ ప్రయత్నం చేయలేదు కానీ, ఊహిస్తున్నాను. అలాగే, ప్రతి ఒక్కరి పనీ గ్రౌండ్ బ్రేకింగ్ అయిపోనక్కర్లేదు. కొన్ని నిజంగానే ఇప్పుడు ఎవరికీ ఉపయోగపడవు అనిపిస్తాయేమో కానీ, ఎవరు చెప్పొచ్చారు, ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు.
ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే – నా మాస్టర్స్ థీసిస్ గురించి వాకబు చేస్తూ, నిజజీవితంలో దానిలోని ఆలోచన గురించి కాస్త ఆలోచిస్తూ, పోయిన వారం నన్ను ఒకరు సంప్రదించారు. నా ప్రగాఢ విశ్వాసం ఒకటి ఉండేది – మనం రాసుకున్న థీసిస్ లు మనమే చదవము మళ్ళీ…ఇంకెవరు మళ్ళీ చదివేది? అని. ఈ నమ్మకం అక్కడ బద్దలైంది (దరిమిలా నేను కొన్ని థీసిస్ లు చదివాను కానీ, ఈ నా ప్రగాఢ విశ్వాసం నా తరహాలో పూర్తి చేసిన థీసిస్ లకి మాత్రమే పరిమితం). అప్పుడు అనిపించింది మళ్ళీ – ప్రతీదీ గ్రౌండ్ బ్రేకింగ్ అవ్వనంత మాత్రాన అది ఎందుకూ పనికిరాదు అనుకోనక్కర్లేదు అని.
**************************
ఇంక సుత్తాపి అసలు పాయింటుకి వచ్చేస్తాను.
ఇక్కడ మొన్నోరోజు ఐన్స్టీన్, మేరీ క్యూరీ ల జీవిత చరిత్రలు కొన్నాము. ఇంకా ఐన్స్టీన్ కథ పూర్తీ చేయలేదు కానీ, రెంటిలోనూ రెండు ఆసక్తి కరమైన కథనాలు ఉన్నాయి – పరిశోధనల గురించి నేపథ్యం లేనివారికి వివరించడం గురించి. రెండూ నాకు చాలా నచ్చాయి. అవి పంచుకోవడానికి ఇంత నేపథ్యం చెప్పాను అనమాట.
“నాన్నా, నువ్వు దేనికి ఇంత ఫేమస్ అయ్యావు?” అని అడిగిన కొడుక్కి ఐన్స్టీన్ సమాధానం…
“When a blind beetle crawls over the surface of a curved branch, it doesn’t notice that the track it has covered is indeed curved. I was lucky enough to notice what the beetle didn’t notice.”
క్యూరీ పుస్తకంలో చదివిన ఒక కథ:
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, “planetary mode of atom” గురించి పరిశోధనలు చేసిన ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ఎక్స్ రే కిరణాల గురించి తన తల్లికి ఒక ఉత్తరంలో ఈ విధంగా వివరించాడు:

“The method is simple. A little bulb is exhausted of air and an electrical discharge sent through. the bulb then lights up and looks of a greenish color. The X-rays are given off and if a piece of cardboard with a certain chemical on it is held near it, metal objects placed near it can be seen through several inches of wood. The bones of the hand can be clearly seen. And if one looks at a spectacle box, no trace of the wood is seen, but only the metal rim and the glass. Aluminium allows the rays to go through easily. I see by the papers the other day, that a blind person or persons without any eyeball can see them when the rays fall on the retina.”
ఇప్పటికి అదీ సంగతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి